చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

  • మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహణ
  • విజయనగరం జిల్లా చిరంజీవి యువత &అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో

విజయనగరం: పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లోని భాగంగా సోమవారం ఉదయం 1 విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) స్థానిక గాజులరేగలో నిర్వహించారు. గాజులరేగ మెయిన్ రోడ్ లో ఉన్న నారాయణ పబ్లిక్ స్కూల్ ఆవరణలో శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్, శ్రీ సాయి డాక్టర్స్ ప్లాజా సౌజన్యంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, ప్రముఖ సంఘసేవకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ డాక్టర్ ఎ.ఎస్. ప్రకాశరావు మాస్టారు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మి లక్ష్మీరాజ్, ప్రకాశరావు మాస్టారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సేవకు ప్రతిరూపమని, అటువంటి చిరంజీవిని స్పూర్తితో ఇటువంటి ప్రజలకు మేలైన సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో మేలుచేస్తాయని, చిరుఅభిమానుల సేవలను కొనియాడారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇచ్చి, సుమారు రెండువందల మంది ప్రజలు వైద్యసేవలు వినియోగించుకున్న ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ లెనిన్ కుమార్, మేనేజర్ జె. విజయ్ కుమార్, హెడ్ నర్సులు వి.ఆదిలక్ష్మి, వి.భవాని, ఎస్.హైమా సేవలందించారు.ఈ కార్యక్రమంలో నారాయణ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మోయిద నారాయణరావు, జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన యువ నాయకులు రవితేజ, ముదిలి శ్రీనివాసరావు, సన్నిధి మధుసూధనరావు, కళ్యాణ్, వాసు, చిన్న పాల్గొన్నారు.