దేవరపల్లి మండలంలో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు

గోపాలపురం నియోజకవర్గం: దేవరపల్లి మండలంలో మంగళవారం జనసేన పార్టీ దేవరపల్లి గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మదర్ తెరిసా విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దొడ్డిగర్ల సువర్ణ రాజు, మండల అధ్యక్షులు కాట్నం గణేష్, సీనియర్ నాయకులు అనిశెట్టి గంగరాజు, కవల సీతారత్నకుమారి, గ్రామ అధ్యక్షులు సత్తిబాబుతో కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. దేవరపల్లిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు జనసైనికులు చప్పటి శివ, జాజిమొగ్గల శ్రీనివాస్, సూరిశెట్టి బాలాజీ, అంజి, పాదం అనిల్ కుమార్, పోలుమాటి నాని, సాయి, వెంకటేష్, సుందర్, నాగరాజు, జయంత్, మహేష్, మనోజ్ మరియు జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.