ఆచంట జనసేన ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో డా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వల్లూరు పెచ్చెట్టి వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో బాలబాలికలకు డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నలు, స్వీట్స్, బిస్కెట్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ పశ్చిమగోదావరి జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ… చిరంజీవి అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి ఈరోజు సినీ ప్రపంచానికి రారాజుగా, సేవ అనే పదానికి మహారాజుగా, అన్ని తరాల యువతకు యువరాజుగా వెలుగొందుతున్నారని… ముఖ్యంగా చిరంజీవికి బాల బాలికలు అంటే అత్యంత ప్రేమ అని అందువలనే ఆయన పుట్టినరోజు వేడుకలు బాలబాలికల మధ్య జరుపుతున్నామని, బాలబాలికందరు కూడా బాగా చదువుకుని ప్రతీ ఒక్కరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య మరియు జనసేన నాయుకులు తోట ఆదినారాయణ, కడిమి ఉమా మహేశ్వరస్వామి, ఏడిద కాసు, మెగా ఫ్యామిలీ అభిమానులు పంపన శ్రీను, వెంకటేశ్వరావు, చిటకన సుబ్బారావు, మొదలగువారు పాల్గొన్నారు.