మొక్కలు నాటిన అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సభ్యులు

విజయనగరం: అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్, కామాక్షి నగర్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు సన్నిది మధు, శ్రీరామ్, చాణక్య, అప్పన్న పాల్గొన్నారు.