సెప్టెంబరు7నుంచి మెట్రో సేవలు పునః ప్రారంభం

మెట్రో సర్వీసులకు అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఢిల్లీలో మెట్రో సేవలను తిరిగిప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణాల కోసం ఇకనుంచి టోకెన్లను జారీ చేయమని, కేవలం స్మార్ట్‌ కార్డులతోపాటు ఇతర డిజిటల్‌ పేమెంట్ పద్ధతులను అనుమతించనున్నట్లు ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లోత్‌  ఆదివారం మాట్లాడుతూ.. సెప్టెంబరు 7 నుంచి మెట్రో సేవలు ప్రారభమవుతాయని.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టేషన్‌లోకి వచ్చే సమయంలో ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

కరోనా భద్రతా నియమాలు పాటించేలా ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఫ్లాట్‌ఫాంలు, ఫ్లోర్‌పై పోస్టర్లు, స్టికర్లు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. 7 నుంచి మెట్రో సర్వీసులు నడవనున్న నేపథ్యంలో తక్కువ మంది ప్రయాణికులను అనుమతిస్తామంటూ.. ప్రభుత్వం మెట్రో మార్గదర్శకాలను విడుదల చేసింది.