ఇదీ మన మాతృభూమి అందమంటే: జనసేనాని వీడియో

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వీడియో రీట్వీట్ చేశారు. ఇదీ మన మాతృభూమి అందమంటే అంటూ కామెంట్ పెట్టారు. ఇటీవల బెంగళూరులో చెలరేగిన అల్లర్లు నేపథ్యంలోనిదీ వీడియో ఓ ఫేస్ బుక్ పోస్టు కర్ణాటకలో మతపరమైన విద్వేషాలకు అల్లర్లకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ అల్లర్ల వేళే.. చోటుచేసుకున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనినే పవన్ రీట్వీట్ చేశారు. ఓ వైపు అల్లరిమూకలు రోడ్డుపై విధ్వంసం సృష్టించేందుకు సిద్దంకాగా  ముస్లింలు చేయి చేయి కలిపి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఆలయానికి రక్షణగా నిలబడడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనికే పరవశించిన పవన్.. మన మాతృభూమి గొప్పదనం ఇదేనంటూ కొనియాడారు. ఈ పోస్టుకి పవన్ ఫ్యాన్స్.. జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున కామెంట్లు.. రీట్వీట్లు చేస్తున్నారు.