పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి: బొర్రా

సత్తెనపల్లి, పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల మంది కార్మికులు కూడా ఇదే సమస్య మీద పోరాటం చేస్తున్నారు. ఎన్ని వినతి పత్రాలు, విజ్ఞప్తులు చేసిన మంత్రుల చర్చలు అంటూ కాలయాపన చేస్తున్నది ఈ ప్రభుత్వం. కార్మికుల సమస్యలు తీర్చాలని అనుకోవడం లేదు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వటం లేదని వారు దండయాత్రకు సిద్ధమయ్యారు. అవసర వస్తువులు 200, 300 రెట్లు పెరిగిపోయిన వారి జీతాలు మాత్రం అంతే ఉన్నాయి. కళ్ళకు గ్లాసులు, చేతులకు గ్లౌజులు మొహానికి మాస్కులు ఇవ్వాలి కానీ ప్రభుత్వం ఈరోజు చేతులు కడుక్కోవడానికి సబ్బులు కూడా ఇవ్వటం లేదు. ముఖ్యమంత్రి 50, 60 మంది సలహాదారులు పెట్టుకున్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ కార్మికులు ఏ విధంగా సహాయపడ్డారో గుర్తించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తానని పాదయాత్ర టైంలో చెప్పారు. ప్రభుత్వం ఆలోచించి వారికి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. సాధ్యమైనంత త్వరగా వేతనాలు అందించాలి. కార్మికులకు దగ్గరలో ఈ.ఎస్.ఐ ఆసుపత్రి కూడా లేదు. ఈఎస్ఐ ఆసుపత్రి కొరకు గుణదల వరకు కార్మికులు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ వాగ్దానం చేశాడు. కార్మికులకు చట్టప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి. రిటైర్ అయిన తర్వాత వారికి అన్ని బెనిఫిట్స్ అందజేయాలి. అన్ని సౌకర్యాలు కల్పించి కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని జనసేన తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, 7వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, సత్తెనపల్లి రూరల్ అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ, నాయకులు చిలకా పూర్ణ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.