డీఎస్పీని కించపరిచిన మంత్రి జోగి: ఎస్ వి బాబు

పెడన, అధికారమదంతో అహంకారంతో ఒక పోలీసు ఉన్నతాధికారితో ఎలా నడుచుకోవాలో తెలియని వ్యక్తిని మంత్రిని చేసిన ముఖ్యమంత్రి తలదించుకునే సంఘటన. మచిలీపట్నంలో ఒక కార్యక్రమంలో డిఎస్పి స్థాయి అధికారిని చాలా తక్కువ భావనతో కించపరిచే విధంగా చీత్కరించుకుంటూ పక్కకు జరుగు అంటూ మంత్రి డిఎస్పిపై మండిపడడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది.

  • బేషరతుగా ఆ డీఎస్పీ స్థాయి అధికారికి మంత్రి క్షమాపణ చెప్పాలి

డీఎస్పీ మసుం బాషా కాకి చొక్కా వేసుకున్న రియల్ హీరో. పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధత, తాను నిర్వహించే వృత్తి పట్ల ఆరాధ్య భావం, ఎలాంటి ఒత్తిళ్లకు తలఒగ్గకుండా నీతి, నిజాయితీతో వ్యవహరిస్తూ చేపట్టిన ఏ పనినైనా నిస్పక్షపాతంగా పూర్తిచేసే నిజాయితీపరుడు మసుం బాషా. డీఎస్పీ అంటే మాకు చాలా గౌరవం. ఒక పోలీసు ఉన్నతాధికారి, మైనార్టీ సోదరుడైన మసుం బాష మంత్రి జోగి రమేష్ వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ మంత్రికి ప్రజలు అంటే గౌరవం లేదు. వ్యవస్థల మీద నమ్మకం లేదు. అధికారులను గౌరవించడం రాదు. పెడన నియోజవర్గ ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులకు మరోసారి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. మంత్రి జోగి రమేష్ ఆరు నెలల తర్వాత మాజీ మంత్రి. మరి డిఎస్పి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఎస్పీగా ప్రమోటై ఓ జిల్లాకే పోలీస్ బాస్ గా తన సేవలను అందిస్తారని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.