శుభమస్తు గ్రాండ్ షాపింగ్ మాల్ లో లక్కీ డిప్ డ్రా

విజయవాడ: శుభమస్తు గ్రాండ్ షాపింగ్ మాల్ లో లక్కీ డిప్ డ్రా కోసం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ ఆయన పోతున మహేష్ మరియు ఎం హనుమాన్ జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు, న్యాయవాది శుభమస్తు గ్రాండ్ కి విచ్చేసి బహుమతి గెలుచుకున్న వారికి వారి చేతుల మీదగా స్కూటీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పండగలు మన రాష్ట్రంలో ఎన్నో జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతిరోజు పండగ లాగా కావాలని కోరుకుంటున్నాం. వైయస్సార్సీపి పార్టీ అధికారంలో ఉంటే ప్రజలు మనశ్శాంతి లేదని, ప్రజలకు మనశ్శాంతి కావాలంటే మంచి ప్రభుత్వం అధికారం లోనికి రావాలని మరోసారి తెలియజేశారు. శుభమస్తు గ్రాండ్ షాపింగ్ మాల్ బందర్ రోడ్ విజయవాడలో ఉన్న మేనేజ్మెంట్ కు వారిని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.