వరద బాధితులకు మంత్రులు, ఎమ్మెల్యేల హామీలు కంటి తుడుపు చర్యలు కాకూడదు

  • ఉమ్మడి వరంగల్ జనసేన పార్టీ నాయకులు మేరుగు శివ కోటి యాదవ్

నర్సంపేట నియోజకవర్గం: వరద బాధితులకు మంత్రులు, ఎమ్మెల్యేల హామీలు కంటి తుడుపు చర్యలు కాకూడదని ఉమ్మడి వరంగల్ జనసేన పార్టీ నాయకులు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు శివ కోటి యాదవ్ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ .. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి కురిసిన భారీ వర్షాలకు వరదల్లో 20 మంది మరణించడం, 12 మంది గల్లంతవ్వడం చాలా బాధాకరం. వరదల్లో మరణించిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా నష్టపోయిన వారికి తక్షణసాయంగా రూ.25,000 వేలు అందించాలి. వాతావరణ కేంద్రం ముందు గానే భారీ వర్షాలు గురించి హెచ్చరించిన అధికారులు,పాలన యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఉంటే “భూపాల్ పల్లి మోరంచపల్లి గ్రామంలో వరంగల్ భద్రకాళి తదితర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయే విషాదకర పరిస్థితి ఉండేదికాదు. వరదల ప్రవాహానికి వేలాది ఎకరాల్లో మునిగిన పంటలపై అధికారులు నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి అండగా నిలవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా జయ శంకర్ భూపాల్ పల్లి, ములుగు, గ్రేటర్ వరంగల్, మహబూబాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వరదలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించి తీవ్ర విషాదాన్ని నెలకొల్పాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 20 మంది మరణించగా 12 మంది గల్లంతు అయ్యారని అధికారిక సమాచారం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉమ్మడి వరంగల్ జిల్లా జన సేన పార్టీ నాయకులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు శివ కోటి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల ఈ విషాద సంఘటనపై శివకోటి యాదవ్ స్పందిస్తూ మరణించిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, నష్టపోయిన వారికి తక్షణ సాయంగా 25 వేల రూపాయలు అందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల హామీలు కంటి తుడుపు చర్యలుగా కాకూడదని అన్నారు. వాతావరణ కేంద్రం భారీ వర్షాల గురించి ముందే హెచ్చరించిన అధికారులు, పాలన యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఉంటే భూపాల్ పల్లి జిల్లా మోరంచపల్లి, వరంగల్ భద్రకాళి తదితర ప్రాంతాల్లో వేలాది మంది కుటుంబాలు నీటిలో చిక్కుకుపోయే విషాదకర పరిస్థితి ఉండేది కాదన్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగు ప్రవాహక ప్రాంతాల్లో పత్తి, వరి తదితర పంటలు వేల ఎకరాల్లో నీట మునిగాయని, అధికారులు నష్టాన్ని అంచనా వేసి, బాధ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వరదల తాకిడికి వందల సంఖ్యలో గ్రామాలు నీట మునిగి పశువులు మరణించి, ఇల్లు కూలి అనేకమంది నిరాశ్రయులు అయ్యారని వారందరినీ ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.