పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు

  • పవన్ కళ్యాణ్ ఒక సునామి.
  • చిన్న మచ్చ కూడా లేని ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్.

విజయవాడ, ఐదు గంటలకు పైగా పోలీస్ వారు పవన్ కళ్యాణ్ ని నిలువరించాలని చూసినా సాధ్యపడలేదంటే పవన్ కళ్యాణ్ కి ప్రజా సమస్యల మీద రాష్ట్ర భవిష్యత్తు మీద ఉన్న నిజాయితీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. జగన్ లాంటి నియంతలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. ప్రజాస్వామ్యాన్ని వ్యక్తిగత స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అనగదొక్కాలని నియంత్రించాలని చూస్తే అంతకు మించిన వేగంతో వైసీపీ మరియు సిఎం జగన్ పునాదులు పూర్తిగా పెకిలించేస్తాం. కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర యాత్ర కోసం సమావేశానికి వస్తున్న పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గమైన చర్య. ఆంధ్రప్రదేశ్ కి ఎవరైనా రావాలంటే సీఎం జగన్ దగ్గర పాస్పోర్ట్ వీసా తీసుకోవాలా అవినీతిపరుడికి, క్రిమినల్ కి, ఫ్యాక్షన్, ముఠా నాయకుడికి ఓటేస్తే రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఒక్క అవకాశం ఒక్క అవకాశం జగన్ కి అవకాశం ఇచ్చినందుకు ఏపీ ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టారు సీఎం జగన్. ఒక న్యాయవాదిగా చెబుతున్నా చంద్రబాబుది అక్రమ అరెస్టు. ముందుగా అన్ని ఆధారాలు చూపాలి. కనీసం ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు కూడా లేకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ కేసు నమోదు చేసి రెండేళ్లకు పైగా గడుస్తున్న ఎంతవరకు ఎందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదు. ఎఫ్ఐఆర్ లో పేరు లేదు కానీ ఏ 36 గా చూపారు వారిని ఏ1 గా ఎలా చూపగలరు. ముమ్మాటికి వైసిపి ప్రభుత్వం కుట్ర అని జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎం.హనుమాన్ అన్నారు.