పని తక్కువ ప్రచారం ఎక్కువైన ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీను

విజయవాడ: టిడిపి ప్రభుత్వంలో పడేసిన గుడులన్నీ కట్టించాను అని, వైసీపీ ప్రభుత్వం కట్టించిందని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించిన చెపుతున్న గుడుల్లో పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలోని కనకమహలక్ష్మి దేవాలయం ఎక్కడ..? అని జనసేన పార్టీ 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ప్రశ్నించారు. శనివారం అనూష మీడియాతో మాట్లాడుతూ మాజీ దేవాదాయ మంత్రి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి చిన్న చిన్న గుడులు కడతానికి మీకు నాలుగు, ఐదు సంవత్సరాల కాలం అవసరం అయ్యిందా..? పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్దపెద్ద దిమ్మలు ఒకటి రెండు రోజుల్లో ఎలా కట్టేస్తున్నారు.. మరొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు గుడులు కట్టావని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగులతో ప్రచారాలు చేసుకుంటున్నారని విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. వెల్లంపల్లి శీను గారు మీరు దేవాదాయ మినిస్టర్ గా ఉన్నప్పుడు అనేక గుడుల మీద దాడులు చేసిన విషయాన్ని, అనేక దేవతామూర్తుల విగ్రహాలని ధ్వంసం చేసిన విషయాన్ని, రథాలను తగలబెట్టిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకున్నారు.. అదేవిధంగా కనక దుర్గ అమ్మవారి గుడిలో మూడు సింహాల మాయం చేసిన విషయాన్ని కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదు.. వైసీపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అనూష తెలిపారు.. ఈ కార్యక్రమంలో41వ డివిజన్ ప్రెసిడెంట్ కూరాకుల సురేష్, తులసి మురళి, రాజేశ్వరి, వెంకట్రావు మరియు కనకమహాలక్ష్మి గుడి కమిటీ సభ్యులు తిరుపతి సురేష్, జాలి రెడ్డి, తిరుపతయ్య, ఎర్రోజు సత్యనారాయణ, పెద్ది సతీష్, ఆదిరెడ్డి, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.