తన పుట్టిన రోజున మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తన జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కవిత ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈ పుట్టినరోజు రోజును ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. అమ్మ , అన్నయ్య సంతోష్‌తో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పుట్టినరోజున మొక్కలు నాటడం ఎప్పటికీ మరిచిపొలేని మధుర జ్ఞాపకం అన్నారు.