ఏ.పి స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ 2023లో సత్తా చాటిన కోనసీమ కుర్రోడు

విశాఖపట్టణం, విశాఖపట్టణం కేంద్రంగా ఈ నెల 13వ తేదీన గాజువాకకు చెందిన పవర్ జిమ్ వారు నిర్వహించిన ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ 2023లో 74 కేజీల విభాగంలో డెడ్ లిఫ్టింగులో కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన మోరం నాగేంద్ర సాయి 175 కేజీలను ఎత్తి తృతీయ స్థానంలో నిలబడి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవర్ జిమ్ వారు మోరం నాగేంద్ర సాయికి కాంస్య పతకాన్ని మరియు సర్టిఫికేట్ ను అందజేయడం జరిగింది. కాంస్యం సాధించిన మోరం నాగేంద్ర సాయిని పలువురు ప్రశంసించడం జరిగింది.