ముద్దబంతి స్కూలును పునరుద్ధరించాలి.. నాడు-నేడు అభివృద్ధి పనుల పరిశీలనలో జనసేన నాయకులు

కాకినాడ సిటీ ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచుతామని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో ఎంతవరకు అభివృద్ధి పనులు జరిగాయో క్షేత్రస్థాయి పరిశీలన వరదా దొరబాబు ఆధ్వర్యంలో జగన్నాధపురం ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ జగన్నాధపురంలో ముద్దబంతి స్కూలుగా ప్రాచుర్యం పొందిన మునిసిపల్ స్కూలుని సందర్శించగా స్థానికులు ఆయనని కలిసి ఈ స్కూలుని మూసివేసారని వాపోయారు. మరి ఆ ప్రాంగణంలోని కడుతున్న కట్టడాలపై ఆరా తీయగా అవి రకరకాల కార్యాలయాలని తెలిపారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ వార్డుల్లో సచివాలయాలు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు మొదలైనవి తప్పకుండా కావాలని వాటికోసం బడిని మూసివేసి ఆస్థలాన్ని వాడుకోవడం అనే కొత్త సాంప్రదాయాన్ని ఇక్కడే చూస్తున్నామన్నారు. మనం లోగడ సొంత కార్యాలయాలు లేక పోస్టాఫీసులు కూడా అద్దిళ్ళలో నిర్వహించడం చూసినదే అని, ఇక్కడ మాత్రం ఇదీ తీరు అని దుయ్యబట్టారు. పార్కుల్లో నీళ్ళటాంకుల నిర్మాణాలు, పచ్చదనాన్ని హరించేలా పనులు చూస్తుంటే తిరోగమనంలో ప్రధమ ర్యాంక్ కోసం పోటీపడుతున్నట్టుందని ఎద్దేవా చేసారు. స్థానికులు తమకి ముద్దబంతి స్కూలు అవసరం ఉందంటూ దానిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టవలిసిందిగా కోరుతూ వారి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని శశిధర్ కు సమర్పించారు. జనసేన పార్టీ తరపున తాను న్యాయం జరిగేలా కృషిచేస్తానని వారికి శశిధర్ తెలియచేసారు. ఈ స్కూలు పునరుద్ధరించాలంటూ జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్, రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా సెక్రెటరీ అట్ల సత్యనారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటీ వైస్ ప్రెసిడెంట్లు అడబాల సత్యనారాయణ & ఓలేటి రాము, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, వార్డు అధ్యక్షులు పెద్దిరెడ్డి రాజేష్, దుర్గాప్రసాద్, శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, మనోహర్, నాయకులు ఏసేబు, భాస్కర్, పెసంగి రాజేష్, దుర్గాప్రసాద్, సుమంత్, షమీర్, సాయికుమార్, దారపు సతీష్, నరసింహ కుమార్, సురేష్, చీకట్ల వాసు, బట్టు లీల తదితరులు పాల్గొన్నారు.