మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మోటూరి దంపతులు

అమలాపురం: ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని జనసేన పార్టీ సారథ్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మరియు చిందాడగారువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర రావు ధన సహాయంతో సోమవారం కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో మానసిక విద్యార్థులకు, అనాధలకు, అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అనాధలకు, దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.