దుర్గాప్రసాద్ ను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, రాపాక గ్రామానికి చెందిన బలిశెట్టి దుర్గాప్రసాద్ కు ఇటీవల యాక్సిడెంట్లో చేతికి గాయం అయింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి గురువారం వారిని పలకరించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు నాగారపు సత్తిబాబు, మట్టా వెంకటేశ్వరరావు, రుద్రం నాగు, బదిరెడ్డి దుర్గాప్రసాద్, షేక్ రబ్బానీ, తోట శ్రీను, చల్లా సతీష్, బలిసెట్టి వెంకన్న, గడ్డం కృష్ణ, వీరమహిళలు లక్ష్మీ, సుధా, మరియు జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.