పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

  • మద్దిరెడ్డి బాబులు కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు మద్దిరెడ్డి బాబులు అత్తయ్య కీ.శే మండారపు శేషాయమ్మ ఇటీవలే స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనసేన నేతల ద్వారా తెలుసుకుని హుటాహుటిన శ్రీకృష్ణపట్నం చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ “బత్తుల బలరామకృష్ణ”, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.

మోరి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో మోరి సత్యనారాయణ భార్య మోరి వెంకయ్యమ్మ ఇటీవలే స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనసేన నేతల ద్వారా తెలుసుకుని హుటాహుటిన శ్రీకృష్ణపట్నం చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.