గాదరాడలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో పలు కుటుంబాలను జనసేన ఆపార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. గాదరాడ గ్రామంలో మైరెడ్డి విష్ణుమూర్తి గారి సతీమణి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారిని పరామర్శించి కుటుంబసభ్యులకు మనోధైర్యం చెప్పారు. అదే గ్రామంలో నివాసముంటున్న చీరల సత్తిబాబు మాతృమూర్తి చీరల వెంకటలక్ష్మి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారిని పరామర్శించి కుటుంబసభ్యులకు మనోధైర్యం చెప్పారు. వీరి వెంట వెంకట జనసేన సీనియర్ నాయకులు, గాదరాడ గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.