కోనసీమ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలి: దారం అనిత

చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత మాట్లాడుతూ.. ‘కోనసీమ పేరు మార్పు’ అన్న విషయంతో అల్లర్లు ప్రారంభమై గత నెల పచ్చని కోనసీమ తగలబడింది. ఆ రోజు మంత్రి విశ్వరూప్ ఇల్లు, స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కూడా అల్లర్లలో తగలబడింది. ఈ దుశ్చర్య వెనక ఎవరున్నారు అన్న విషయంలో అధికార వైసీపీ ఎప్పటిలానే ప్రతిపక్షాలను ముఖ్యంగా జనసేనను ముందు దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నించింది.

కానీ ఈ రోజు మంత్రి విశ్వరూప్ ముఖ్య అనుచరులు సత్యరుషి, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘులను నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మంత్రి గారి ప్రధాన అనుచరులు గొడవల్లో పాల్గొని ఇళ్ళు తగలబెట్టించుకొని అపవాదు మాత్రం ప్రతిపక్షాల మీద వేస్తున్నారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేపించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని జనసేన తరపున దారం అనిత డిమాండ్ చేశారు.