పలు కుటుంబాలకు శ్రీమతి బత్తుల పరామర్శ

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, రాజానగరం మండలంలో పలు కుటుంబాలను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శీలంశెట్టి వెంకటరాజు ఇటీవల స్వర్గస్తులైనారు.. బుధవారం వారి పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందిన దాడి కుమారి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసుకుని వారిని పలకరించు ప్రస్తుత ఆరోగ్య పరిస్థిఇ అడిగి తెలుసుకున్నారు. రాజానగరం మండలం కాపవరం గ్రామానికి చెందిన నాగవరపు సత్యనారాయణ ఇటీవల స్వర్గస్తులైనారు.. బుధవారం వారి పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.