పాలకొండ టౌన్ జనసేన ఆత్మీయ సమావేశం

పాలకొండ నియోజకవర్గ పరిధిలో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి మంగళవారం స్థానిక గొల్లవీధిలో ఉన్న జనసైనికులతో చిన్న ఆత్మీయ సమావేశం పాలకొండ టౌన్ టీమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా స్థానిక సమస్యలు గురించి మాట్లాడుతూ… ప్రజా సమస్యల పై పోరాటం చెయ్యాలి, ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు బలంగా తీసుకు వెళ్ళాలి అంటే గ్రామ స్థాయిలో మనం సమస్యలు పై బలంగా పోరాడాలని చెప్పారు. మీ చుట్టూ ఉన్న సమస్యలు గుర్తించి మా దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారించే దిశగా అడుగులు వేస్తూ పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు మనమంతా ఒకే తాటిపై కలిసి ముందుకు వెళ్ళాలి, అలా చేస్తే మన పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్బంగా మీకు అన్నీ విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొన్నారు.