రెండు కుటుంబాలకు ఆర్ధికసాయమందించిన శ్రీమతి కాంతిశ్రీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, జి సిగడం మండలం నిద్దాం పంచాయతీ సర్పంచ్ మీసాల రవికుమార్ పిలుపు మేరకు ఆ గ్రామానికి వెళ్లి గురువారం రెండు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ. నిద్ధాం గ్రామ పంచాయతీ పరిధిలో జన సైనికులు అయిన చౌదరి రమణ కుమారుడు గణేష్ కి ఏక్సిడెంట్ అయిన విషయం తెలుసుకుని కాంతిశ్రీ గ్రామానికి వెళ్ళి ఆర్ధిక సహాయం అందించారు. అలాగే కర్రి గొల్లారాజు పెరాల్సిస్ తో బాధపడుతున్నారు ఈ విషయం తెలుసుకుని కాంతిశ్రీ గ్రామానికి వెళ్ళి ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఏర్నేన శ్రీరామ్మూర్తి బాలి నారాయణ రావు, ఏర్నెన గోవిందరావు మాస్టర్, దుర్గారావు, కాకర్ల బాబాజీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.