కాపు భవనాన్ని పరిశీలించిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి, ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి కాపు భవనంకి ప్రకటించిన కోటి రూపాయలు 5 సంవత్సరాలు అయినా ఇవ్వకుండా బలిజలను మోసం చేశాడు. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 2,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలలో 10,000 కోట్లు కాపులకు ఇస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ “మాట తప్పాడు, మడమ తిప్పాడు.” కోటి రూపాయల చెక్కు ఇవ్వాలని సవాలు విసిరిన శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు, బలిజ నాయకులకు ప్రతి సవాల్. వైసీపీని వీడి శ్రీకాళహస్తిలో కాపులు, బలిజలు జనసేనలో చేరండి కోటి రూపాయల చెక్కు వెంటనే ఇస్తాం, లేక భవనం కట్టి గృహ ప్రవేశం చేసి ఇస్తాం. ఊడిగం చేసే కాపు, బలిజ నాయకులు దమ్ముంటే ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని కాపు భవనం ఎందుకు కట్టలేదు అని అడగండి అని అన్నారు.