నరసాపురం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

నరసాపురం: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా నిర్మాత కొణిదెల నాగబాబు ఆ సినిమా ను రీ-రిలీజ్ చేసి వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా అందజేస్తానని తెలిపిన విషయం అందరికీ విదితమే. ఈ క్రమంలో జనసేన ఆధ్వర్యంలో నరసాపురం శ్రీ రాజరాజేశ్వరీ ధియేటర్ వద్ద రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ చేయగా ఈ సందర్భంగా మెగా అభిమానులు మాణికిరెడ్డి, మణికంఠ మరియు కూనపరెడ్డి ఏసు ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ముఖ్య అథిదిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.