పదివేల రూపాయల ఆర్థిక సాయమందించిన ముదినేపల్లి జనసేన

కైకలూరు, ఇటీవల గురజ గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించిన 12 సంవత్సరాల గొర్ల నాగ దుర్గారావు బాలుడి తల్లి తండ్రులను పరామర్శించి పదివేల(10,000/-) రూపాయల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి ప్రభుత్వం వారి నుండి రావలసిన నష్టపరిహారాన్నీ పొందడంలో కూడా మేము అండగా నిలబడి మా వంతు సాయం మేము చేస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన ముదినేపల్లి మండల జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.