ముద్రగడ లేఖ.. డైవర్షన్ పాలిటిక్స్

పీలేరు నియోజకవర్గం: ముద్రగడ, పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖపై పీలేరు నియోజకవర్గం జనసేన నాయకులు స్పందిస్తూ.. జిల్లా ప్రధాన కార్యదర్శి కలప రవి, మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ, ప్రధాన కార్యదర్శులు పవన్, గజేంద్ర, కార్యదర్శులు హరీష్, నవీన్, దిలీప్ మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కలప రవి మాట్లాడుతూ ముద్ర రెడ్డి అనే పేరు కోసం ఇన్నాళ్లు పాటు పడిన పెద్దాయన అని చెప్పుకునే తిరిగే నీకు.. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు శాశ్వతంగా కోల్పోయారు.. కాపు జాతి తాకట్టు పెట్టే.. ఎవరైనా సరే దీనికి అర్హులు అండి.. మీకు కాలం చెల్లిపోయింది అండి.. కాపు ఆడబడుచులని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీనీ తిట్టినప్పుడు ఎక్కడ వున్నారు మీరు.. ఈ రోజు ఒక రెడ్డి కి కౌంటర్ ఇస్తే సిగ్గు లేకుండా లెటర్ రిలీజ్ చేస్తారా.. దీనిని జనసేన పార్టీ, పీలేరు నియోజకవర్గం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము.. ఈ వయసులో కనీసం మంచి చేయకపోయినా పర్వాలేదు.. 8 పదుల వయసులో శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారిని చూసి అయినా మికూ బుద్ది రావాలని కోరుకుంటున్నామని అన్నారు. మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. వారాహి యాత్ర విజయవంతం కావడం వల్లే, జగన్ గారి దర్శకత్వంలో ముద్రగడ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లా పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారని, డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీసారన్నారు.