సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీ

చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదా మండలం ఇప్పలవలస గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు ఆధ్వర్యంలో జనసేన ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గులు పోటీల్లో సుమారుగా 40 మంది ఆడపడుచులు పాల్గొన్నారు పెద్దల సమక్షంలో ఆరుగురిని ఎంపిక చేయడం జరిగింది ఎంపికైన వారందరికీ మండల అధ్యక్షులు చేతులు మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ టి నాయుడు, కెలారి సీతారాం, ఎన్సీహెచ్ నాయుడు, లంక శంకర్, బండారు శ్రీను, రామ్ నాయుడు, రమేష్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.