భైంసా జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ గౌరవ రాష్ట్ర ఇంఛార్జి,నేమురి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి సైదాల శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భాగంగా భైంసా పట్టణంలోని ఐలమ్మ గద్దె వద్ద జాతీయ జెండా ఎగరేసి జాతీయ గీతం ఆలాపన చేసి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన విద్యార్థులను, మహనీయులను గుర్తు చేస్తూ నివాళులు అర్పిస్తూ, వారి త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు… రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు జోహార్లు తెలియచేస్తూ రాష్ట్ర ఏర్పాటుకు పాటుపడిన ఎందరో ప్రముఖులు, మహనీయులు, కవులు, రచయితలు, విద్యార్థులు, ఉద్యోగులు, సకల జనుల సమ్మె, వివిధ రూపాల్లో పోరాటాలు, ఆత్మ బలిదానాలు, ఎందరో మంది ప్రాణ త్యాగాలు, పోలీసుల అరెస్టుల ఫలితంగా రాష్ట్ర సాధన సాధించారు. కానీ వారు చేసిన త్యాగం తెలంగాణలో బూడిదలో పోసిన పన్నీరులా అయ్యింది. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసి రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబానికి దారదత్తం చేయడం జరిగింది. వాళ్ళకే అన్ని పదవులు దక్కించుకున్నారు. దీనికి తోడు తెలంగాణ వ్యతిరేకులకు కూడా పదవులు ఇవ్వడం చాలా దురదృష్టకరం. ఇప్పటికీ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. రైతులకు సరైన గిట్టు బాటు ధర లభించక ఆత్మహత్యలు చేసుకున్నారు. బంగారు తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయలేదు, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, పని దొరక్క వలసలు వెళ్ళే పరిస్థితి దాపురించింది. కాబట్టి తెలంగాణలో మళ్ళీ మలిదశ పోరాటానికి అందరు సిద్దంగా ఉండాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ కార్యకర్తలు బోజరామ్, నవీన్, భిం ఛంద్రే, తుకారాం, లక్ష్మణ్, రాములు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.