ములకలపల్లి మండల జనసేన అత్యవసర సమావేశం

అశ్వారావుపేట: 2024 సార్వత్రిక ఎన్నికలను మరియు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ మండల వ్యాప్తంగా చేపట్టవలసిన కార్యక్రమాలను, జనసేన పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలను, పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను ప్రజలకు వివరించే క్రమంలో భాగంగా ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో మండల నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన నాయకులు గరికే రాంబాబు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ములకలపల్లి మండల నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా అశ్వరావుపేట నియోజకవర్గం లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నది అని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని. అలాగే త్వరలో జనసేన పార్టీ అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డేగల రామచంద్ర రావు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అశ్వరావుపేట నియోజకవర్గంలో ఐదు మండలాల్లో క్రియాశీలక కార్యకర్తలతో నియోజవర్గ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని అలాగే క్రియాశీలక కార్యకర్తల కిట్ల పంపిణీ కార్యక్రమం, మరియు ఐదు మండలాల్లో క్రియాశీలక కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో స్థానిక నాయకులు పర్యటిస్తూ, అక్కడి సమస్యలు తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను తెలియజేస్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ములకలపల్లి మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, కందుకూరి వినీత్, మండల ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రం, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొక్క వెంకటేశ్వర్లు, బోడ నాగరాజు నాయక్, మండల నాయకులు ఎస్ కే రఫీ పాషా మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.