ప్రచారాన్ని ముమ్మరం చేసిన ముమ్మారెడ్డి ప్రేమకుమార్

తెలంగాణ, కూకట్ పల్లి, బోయిన్ పల్లి డివిజన్ లో బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బిజెపి జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ముందుగా ఓల్డ్ బోయిన్ పల్లి లాస్ట్ బస్ స్టాప్ లోని హనుమాన్ దేవాలయం నందు పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. యాదవ్ బస్తి, మల్లికార్జున కాలనీ, ఆర్. ఆర్ నగర్, గౌరీ నగర్, విటల్ ఎంక్లేవ్, మీదుగా బిజెపి జిల్లా ఆఫీస్ వరకు పాదయాత్ర కొనసాగింది. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వారి మద్దతు తెలియజేస్తున్నారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. బోయిన్ పల్లి డివిజన్లో భారీ జన సందోహం మధ్య పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజలకు అభివాదాలు తెలుపుకుంటూ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. బోయిన్ పల్లిలో సమస్యలు చాలా ఉన్నాయని అవి మా దృష్టికి వచ్చాయని ఆ సమస్యలు డ్రైనేజీ వాటర్ ప్రాబ్లం, త్రాగునీటి కొరత, రేషన్ కార్డులు సమస్య, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ప్రతి సామాన్యుడు కల సొంత ఇల్లు నిర్మించుకోవాలని కానీ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వని పరిస్థితి, అలాగే 60 సంవత్సరాలు నిండిన వారికీ పెన్షన్లు ఇవ్వట్లేదు. ప్రధానంగా బోయిన్పల్లిలో చెరువు కట్ట దగ్గర భూ కబ్జాలు జరిగాయి. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఇకపై ఇస్తారన్న నమ్మకము లేదు. బిజెపి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా ఈసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నిటి పైన పరిష్కారం చూపించే విధంగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, మాధవరం కాంతారావు, ఎ. సూర్యారావు, శ్రీకర్ రావు, మద్ధతు ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.