ప్రజా సమస్యలపై వినతిపత్రం స్వీకరణకు కూడా జంకుతున్న మున్సిపల్ అధికారులు: చెన్నారెడ్డి మనుక్రాంత్

నెల్లూరు కార్పొరేషన్లోని స్థానిక సమస్యల పై నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలసి మున్సిపల్ కమీషనర్ కి వినతిపత్రం ఇవ్వటానికి నెల్లూరు మన్సిపల్ ఆఫీసుకు చేరుకున్న వారిని బారీ సంఖ్యలో పోలీసులు లోపలికి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. తదుపరి కార్యకర్తలను రానివ్వకుండా నాయకులను మాత్రం పరిమితి సంఖ్యలో లోనికి అనుమతించారు. లోనికి వెళ్లేటప్పటికి శనివారం ఉదయం నుంచి మూడు సార్లు ఆపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి కూడా మున్సిపల్ కమీషనర్ హరిత అందుబాటులోకి రాలేదు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మరియు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ మాట్లాడుతూ.. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మేము పర్యటిస్తున్నపుడు అనేక సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. రోడ్లదుస్థితి, దోమల సమస్య, డ్రైనేజి కాలువలు పూడికలు తీయకపోవడం, కుక్కలు, పందుల స్వైరవిహారం, చెత్త సేకరించటంలో జాప్యం మొదలగు సమస్యలు ముఖ్యంగా 1. నెల్లూరు నగరంలో ఇటీవల పడిన వర్షం కారణంగా రోడ్లు అన్ని జలమయం అయిపోయాయి. మున్సిపల్ పరిధిలో రోడ్లు వేసిమరల అండర్ గ్రౌండ్ వాటర్ పైపులైన్స్ త్రవ్వి ఆ రోడ్లన్ని అస్థవ్యస్థం అయిపోయాయి. 2. నెల్లూరు నగరంలో పన్నులు వసూలు చేసుకునే ఇల్లుతప్ప, ఏ పాయింట్లో చెత్తను క్లియర్ చేయండం లేదు, వాటి వల్ల దుర్వాసన, దోమలు ఎక్కువుగా అయిపోయినాయి. వాటిని పట్టించుకోవడంలేదు. 3. అంతే కాకుండ రోడ్లల్లో పగలు, రాత్రుళ్లు వీధి కుక్కలు, పందులు వలన ప్రజలు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 4. మురుగు ఏర్పడటం వలన దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ విషజ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు కూడా ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ తో పాటు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా మరియు నగర నాయకులు గుత్తు శ్రీకాంత్, కంతర్, అక్కిశెట్టి శ్రీధర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.