రిపబ్లిక్ డే వేడుకలలో ముత్తుకూరు జనసేన

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ముత్తుకూరు మండల జనసేన నాయకులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముత్తుకూరు మండలం, పిడతపోలూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి మాట్లాడుతూ.. నేడు గణతంత్ర దినోత్సవమే కాకుండా, భారత దేశ ఔన్నత్యాన్ని, సమగ్రతను చాటే ‘జనగణమన’కు జాతీయ గీతంగా గుర్తింపు వచ్చిన రోజు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ రవీంద్రనాథ్ ఠాగూర్ (రవీంద్రుడి) రచనను స్వీకరించి జాతీయ గీతంగా ప్రకటించిన రోజు. ఆలాపనకు 52 సెకన్లు పట్టే ఈ విశిష్ట రచన దేశంలోనే సంస్కృతులను ప్రతిబంబించేలా, భిన్నత్వంలో ఏకత్వం చాటేలా ఉంటుందని ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన రోజు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలూరు పెంచల నరసింహా, సి.హెచ్ కసుమురు, తాండ్ర శ్రీను, ఏపూరు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.