మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిథర్

కాకినాడ సిటి: స్దానిక 26బి వార్డు సచివాలయం ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు కర్రి ధర్మారావు ఆధ్వర్యంలో మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమం లో జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్, పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ పాల్గొని స్దానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు మాట్లాడుతూ ముఖ్యంగా కరెంట్ బిల్లు, చెత్త పన్ను చెల్లింపులు భారంగా మారాయని బాధితులు పేర్కొన్నారు. ఇళ్ళు ఇస్తున్నామని చెపుతున్నారు కానీ ఏదొ కొంతమందికే మంజూరు చేసారనీ, అవికూడా ఎక్కడ ఉన్నాయో తెలియడంలేదన్నారు. ముత్తా శశిథర్ వద్ద మొర పెట్టుకున్న బాధితురాలి ఆవేదన పై ఆయన స్పందిస్తూ జగన్ పాలన మోసాల పుట్ట అని వైకాపా ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసిన సంక్షేమ పథకాల చిట్టా రుజువు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సమస్యలపై నాయకులను ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని దైర్యం చెప్పారు. రూ 20 వేలు కట్టించుకుని ఇళ్ళ పట్టాలు ఇస్తామని ఎవరైనా వస్తె ఎందుకు కట్టాలి వివరాలు ఇమ్మని అడగండి అన్నారు. జగన్ మాట నమ్మి మోసపోయామని అందుకు ఫలితం గా ఇన్ని రకాల అనర్ధాలు వెంటాడుతున్నాయి అని, సన్న బియ్యం పేరుతో పేదలను నట్టేట ముంచారనీ, ఈ వై.సి.పి ప్రభుత్వ హయంలో మత్స్యకారుల ప్రాణాల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని అన్నారు. వై.సి.పి ప్రభుత్వ అరాచకాలు, ఆగడాలు నిలువరించాలంటే ప్రజలు పోరాట బాట పట్టాలని సూచించారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు వారివెంట జన సేన పార్టీ అండగా ఉంటునదని బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తలాటం సత్య, కాకినాడ సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, పద్మరాజు, వెంకట్రామన్, ఓలేటి రాంబాబు, పి.రాము, సతీష్, బ్రహ్మయ్య, కర్రి ధర్మారావు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.