జలుమూరు మండలంలో ఇంటింటికి జనసేన క్యాలెండర్ ల పంపిణీ

జలుమూరు మండలం, అందవరం పంచాయతీ, రామకృష్ణాపురం గ్రామంలో జనసేన నాయకులు నడుపూరు తిరుపతిరావు ఆధ్వర్యంలో జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం జలుమూరు మండలంలో ప్రతి ఇంటింటికి జనసేన క్యాలెండర్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తిరుపతిరావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు సమాజంపట్ల, నిరుపేదల పట్ల ఆదుకునే విధంగా అతీతంగా నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.