పలచోళ్ళ వేణు అధ్వర్యంలో ”మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన” క్యాంపెయిన్

అమలాపురం, నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మరియు అమలాపురం నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ పలచోళ్ళ వేణు అధ్వర్యంలో ”మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన” క్యాంపెయిన్ లో భాగంగా, క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేశారు. క్రియా వాలంటీర్స్ కు 18 సంవత్సరాలు దాటిన వారిని గుర్తించి వారికి కొత్తగా ఓటు హక్కు నమోదు చేసే ప్రక్రియ మీద అవగాహన సదస్సు అమలాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో నియోజకవర్గ ఇంఛార్జి శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్క ఓటు ప్రాధాన్యత, రాష్ట్రాన్ని మార్చగలిగే యువశక్తిని సరైన మార్గంలో నడిపించుకోవాల్సిన రీతిని వివరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటీ కోఆర్డినేటర్ గాలిదేవర తమ్మేష్, అమలాపురం టౌన్ ఐటీ కోఆర్డినేటర్ సుంకర వెంకటేష్ తో పాటు జనసేన నాయకులైన రాష్ట్ర కార్య నిర్వహణ కమిటీ సభ్యులు మహాదశ నాగేశ్వరరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల బుజ్జి, కటికిరెడ్డి బాబీ, తూము రమేష్, చిక్కం సూర్య మోహన్, పిండి గణపయ్య, సత్తి శ్రీనివాస్, వంగా నాయుడు, తాళ్ళ రవి, మోకా బాలయోగి, రొక్కాల నాగేశ్వరరావు, ముత్తాబత్తుల శ్రీను, అర్లపల్లి దుర్గ, తిరుమల రమేష్, వీరమహిళ చిక్కం సుధారాణి మరియు తదితర జనసేన నాయకులు, క్రియా వాలంటీర్స్, జనసైనికులు పాల్గొన్నారు.