గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన

  • మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన 3వ రోజు

నెల్లూరు రూరల్, శ్రీ చైతన్య కాలేజ్, మాగుంట లేఔట్. రాజకీయాల్లో జవాబుదారీతనం గురించి యువత ప్రశ్నించాలి అంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుగులు కిషోర్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకొని బాధ్యతగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలి. ఓటు అనే ఆయుధంతో సమాజాన్ని మార్చవచ్చు. మనకెందుకులే అని నిర్లక్ష్యం వహిస్తే అసమర్థులు రాజ్యమేలుతారు. ఒక అవకాశం అంటూ వేసిన సానుభూతి ఓటు ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో ప్రథమ స్థానాన్ని నిలిపింది. అవగాహన లేకుండా సంపద సృష్టించడం మరిచి అభివృద్ధి గురించి పట్టించుకోక, గ్రామాల అభివృద్ధికి వాడాల్సిన నిధులన్నీ మాయం చేస్తుంది ఈ వైసిపి ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి వెళ్తున్న ప్రజా ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇచ్చిగెలిపించాలి. ఇంట్లో పెద్దలకు తెలపండి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా రానున్న రోజుల్లో ఆపేది లేదు. మీ అందరికీ ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన అవకాసం ఇవ్వాలి. దీనికి మీరు ఓటు వేయడమే కాక మరి కొంతమందిని ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలి. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించి ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిన ఆవశ్యకత గురించి ప్రతి ఒకరికి తెలపండి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, బన్నీ, వర, హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.