ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలి: అవనిగడ్డ జనసేన

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 18,1920 మూడు రోజులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్లో మరియు రాజ్యసభలో ప్లకార్డ్స్ ప్రదర్శించాలని ఇచ్చిన పిలుపు డిజిటల్ క్యాంపెయిన్ ఉద్యమాన్ని రెండవ రోజు అవనిగడ్డ లో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు చేత పట్టి విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు అనీ నినాదాలు చేసి నిరసన చెయ్యటం జరిగింది. ఆదివారం ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు, జిల్లా కార్యదర్శి గాజుల శంకర్ రావు, ఎంపీటీసీ సభ్యులు కటికల వసంత్ కుమార్, బొప్పన భాను, అశ్వరపాలెం ఉప సర్పంచ్ నాగరాజు, వార్డు మెంబెర్స్ శ్రీలక్ష్మి, ప్రతాప్, జనసేన నాయకులు రాజనాల వీరబాబు, తోట ఆంజనేయులు, మత్తి సుబ్రహ్మణ్యం, పప్పుశెట్టి శ్రీనివాస్ రావు, తుంగల నరేష్, నాగరాజు, గౌస్, అన్నపరెడ్డి యేసు బాబు, చందు తదితరులు పాల్గొన్నారు.