బత్తుల దంపతుల ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

  • అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి లక్ష రూపాయల ఆర్ధికసాయం
  • రాజానగరం జనసేనలో చేరికలు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి మరియు ఆ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ…. దోచుకోవడం దాచుకోవడం కాకుండా తన కష్టార్జితంతో పార్టీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, జనసేన పార్టీకి ఆర్థిక భరోసా కల్పించి భవిష్యత్తులో ఉన్నతమైన సమాజం నిర్మించడం ప్రతి జనసైనికుడి లక్ష్యం కావాలని, దానికి తగ్గట్టు ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా పార్టీకి ఆర్థిక విరాళాలు ఇవ్వాలని కోరారు. అలాగే మీరు ఎంత ఇచ్చారు అన్నది ముఖ్యం కాదని, ఎంతమంది పార్టీ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారన్నది ముఖ్యమని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

  • అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి లక్ష రూపాయల ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో బత్తుల దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో స్థానిక నేతలు అతి చిన్న వయసులోనే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న రాజా భూలక్ష్మి అనే చిన్నారి విషయం తెలపగా బత్తుల దంపతులు ఆమెకి ఆపరేషన్ నిమిత్తం తక్షణమే స్పందించి మానవతా దృక్పథంతో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో ఇదే చిన్నారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన విషయం విధితమే. అనంతరం చిన్నారికి భవిష్యత్తులో పార్టీ తరఫున అన్ని విధాలాగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.

  • రాజానగరం జనసేనలో చేరికలు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో బత్తుల దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి, మట్ట వెంకటేశ్వరరావు సమక్షంలో వైసిపి, టిడిపి నుండి సింగవరం గ్రామానికి చెందిన ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.