పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

ఆమదాలవలస, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు నియోజకవర్గంలోని బూర్జ మండలంలో ఆదివారం కార్యకర్తలతో కలిసి స్థానికంగా ఉన్న అన్ని షాపుల్లో సందర్శించి జనసేన పార్టీ అవలంబిస్తున్న క్రౌడ్ ఫండింగ్ యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, అప్పలరాజు, మధు, పోలీనాయుడు, బాలు, జడ్డు రాంబాబు, లక్ష్మణరావు, నాగరాజు, సాయి, శివ, ఏషు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.