బత్తుల ఆధ్వర్యంలో “నా సేన కోసం నా వంతు”

* కొత్త వెలుగుబంద మరియు కొత్త తుంగపాడు గ్రామాల్లో “నా సేన కోసం నా వంతు”

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం కొత్త వెలుగుబంద గ్రామంలో ఏర్పాటు చేసిన నాసేన నావంతు కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గ నాయకురాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మికి కొత్త వెలుగుబంద ప్రజలు పుష్పాభిషేకాలతో ఘనస్వాగతం పలికారు. ప్రజాక్షేమం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపే కార్యక్రమమే ‘నా సేన కోసం నావంతు’ కార్యక్రమం బత్తుల వెంకటలక్ష్మి జనసైనికులకి వివరించారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రజలకోసం పాటుపడుతున్న పార్టీ జనసేన అని ఘంటాపథంగా తెలియజేసారు. చదువుకున్న యువత, విజ్ఞులు రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన పార్టీకీ మద్దతుగా నిలవాలని తెలియజేసారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మహత్కార్యాన్ని తలపెట్టిన పవన్ కళ్యాణ్ కి మన వంతుగా సహకారం అందించే మార్గమే ఈ నాసేన నావంతు కార్యక్రమం అని ఆమె పేర్కొన్నారు. అనంతరం రాజానగరం మండలం, కొత్త తుంగపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘నాసేన కోసం నావంతు’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమానికి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మికి కొత్త తుంగపాడు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాసేన కోసం నావంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న పార్టీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, జనసైనికులకి పార్టీ మీద ఉన్న అభిమానాన్ని ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో చూపించినందుకు కొత్త తుంగపాడు జనసైనికులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట అనిల్ వష్, ఇవ్వకల చిట్టిబాబు, మంచాల శ్రీను, చాట్ల వెంకటేష్, పెద్దిరెడ్డి శ్రీను, తూము రాముడు, తూము గోవిందు, దసరా సోమ్మాన, ప్రగడ సోమన్న, అల్లా లోవరాజు, జగదా పోసియ్య, ప్రగడ వీరబాబు, తూము గోవిందు, ముసమాళ్ళ తాతారావు, తోట శ్రీను, తోట అర్జున్, తోట యాసుబాబు, తోట వీరబాబు, తోట వెంకటేశ్వర్లు, తోట యాసురత్నం, ప్రగడ కిషోర్, ప్రగడ రాముడు, ప్రగడ గొల్లియ్య, గుగిల్లిపు శ్రీను, మారుకుర్తి సతీష్, మారుకుర్తి దుర్గాప్రసాద్, మారుకుర్తి భద్రం, బావురుశెట్టి వెంకటేష్, సుంకర సురేష్, నాగులపిల్లి వెంకటదుర్గ, అబ్బీరెడ్డి దుర్గాప్రసాద్, లొల్ల గణేష్, ముత్యం గోవిందు, కేతమల్ల వీరబాబు, తోట లక్ష్మణరావు, మంచాల రామకృష్ణ, దాసరి సతీష్, దాసరి బాబీ, ప్రగడ బాలాజీ, వల్లభశెట్టి రమణ, సొండ్రు ప్రకాశం, తూము వెంకటేషులు, ప్రగడ రాముడు తదితరులు పాల్గొన్నారు.