రాయలసీమ అభివృద్ధికి ఎన్3 ఫార్ములా

  • నీరు, నిధులు, నియామకాలతోనే సీమ అభివృద్ధి
  • పాలకులు నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు
  • సీమ వాసులను కూలీలుగా మార్చిన ఘనత పాలకులదే
  • రాయలసీమ అభివృద్ధికి సమస్యలపై ఇష్టాగోష్టిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు: రాయలసీమ అభివృద్ది చెందాలంటే ఎన్ 3 ఫార్ములాతోనే సాధ్యమని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి, సమస్యలపై జరిగిన ఇష్టాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నీళ్లు, నిధులు, నియామకాలతోనే సాధ్యమన్నారు. ఈ ఎన్ 3 ఫార్ములాతోనే సీమ అభివ్రుద్ది చెందుతుందన్నారు. రాయలసీమకు నీళ్లు అందించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. వేల కోట్ల రూపాయలతోనే చేపట్టిన జలయజ్ణాన్ని ధన యజ్ణంగా మార్చారన్నారు. కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటి వరకు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధులను విడుదల చేయడం ఆపేశారన్నారు. అరకొర నిధులు విదిల్చి సీమకు మేలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. హంద్రీ నీవా, గాలేరు నగరి, గండికోట ప్రాజెక్టులు ఇవ్వటి వరకు పూర్తి కాలేదన్నారు. రైతులకు కావాల్సింది సాగు నీరని, అవి ఇవ్వకుండా పదివేల రూపాయలు భిక్ష వేస్తోందని దుయ్యబట్టారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కానీ అవేమీ పట్టకుండా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటోందన్నారు. అలాగే రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహాలు జిల్లాకు ఏడాదికి 500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే పరిస్థితిల్లో లేదని, రాష్ట్రం అడిగే పరిస్థితిల్లో లేదన్నారు. అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ వల్ల చాలా ఉద్యోగాలు వచ్చాయన్నారు. కానీ మన్నవరం వద్ద ఉన్న భెల్ కంపెనీని మూసేయడంతో సీమకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కడప స్టీల్ ప్లాంట్ కు అతీగతీ లేదన్నారు. అమరరాజా తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఇక ఉద్యోగ అవకాశాలు లేక సీమ వాసులు అరబ్ దేశాలకు వలస వెళుతున్నారన్నారు. రాయలసీమ వాసులు ఇతర దేశాల్లో కూలీలుగా బ్రతుకుతుంటే.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల వారు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిల్లో ఉన్నారన్నారు. దీనంతటికీ కారణం పాలకులేనన్నారు. దాదాపు ఏడు మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించినా సీమ బాగుపడలేదన్నారు. జనసేన అధికారంలోకి వస్తే సీమ అభివ్రుద్దికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో సీమకు ఏం చేస్తామో వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మేనిఫెస్టోలో వివరిస్తామన్నారు. సీమ అభివ్రుద్దికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు తులసి రెడ్డి, ఏఐటీయూసీ, సిపిఎం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే గాఫుర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ పార్లమెంట్ ఇంచార్జ్ నరసింహ యాదవ్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఊక విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, జనసేన గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, నగర అధ్యక్షులు రాజారెడ్డి, సీఐటీయూ నాయకులు కందరపు మురళి, జనసేన సిటీ కమిటీ సభ్యులు, పార్ధు, కొండా రాజా మోహన్, వంశీ, రాజేష్ ఆచారి, కిరణ్ కుమార్, హేమంత్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, వీరమహిళలు శిరీషా దివ్య, మధులత తదితర అఖిలపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు.