నాదెండ్ల మాట కాకినాడ సిటీలో అందరి నోట

కాకినాడ సిటీ: జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట కార్యక్రమం గురువారం జగన్నాధపురం మునసబు గారి జంక్షన్ సెంటర్ వద్ద జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు నేటి ఈ వై.సి.పి ప్రభుత్వం ప్రజల డబ్బులని ఏవిధంగా అక్రమ మార్గంలో దోచుకుతింటున్నదీ నాదెండ్ల మనోహర్ వెలికితీసిన వివరాలను ప్రజలకు వివరిస్తూ తెలియచేసారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా అసలు రాజకీయాలకీ, ప్రభుత్వాలకీ అర్ధాలు మార్చేసాడన్నారు. ఇంతకుముందు రాజకీయాలంటే ప్రజల సమస్యలపైన ప్రభుత్వాలని నిలదీయడం, పోరాటాలు చేయడంగాను, ప్రభుత్వాలు అంటే ప్రజల సంక్షేమం కోసం పాలన చేయడం అని ఉండేదనీ, అవి నేడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాకా రాజకీయం అంటే కల్ల బొల్లి మాటలు, వాగ్దానాలు చేయడం, నిందలు వేయడం, దాడులు చేయడంగాను, ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలమీదా, ప్రశ్నించే ప్రజల మీదా పోలీసు కేసులు పెట్టడం, హింసించడం, పధకాల ముసుగులో అవినీతి చేయడం కోట్లాది రూపాయలను నొక్కేయడం అని అన్నారు. పరిస్తితి ఎలా ఉందంటే అవినీతి జరగని ప్రభుత్వ పధకం ఏదన్నా ఉంటే చూపించాలని సవాలు విసిరారు. అసలు అవినీతి కేసులలో బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవికి చేపట్టే నైతిక అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, బస్వాని నాగబాబు, మళ్ళిపూడి శివాజీ యాదవ్, మల్లాడి నంద కుమార్, వరిపల్లి ప్రసాద్, వెంపా ప్రసాద్, గోగు సతీష్, చోడిపల్లి సత్యవతి, దారపు శిరీష, రచ్చ ధనలక్ష్మి, చింత దుర్గ తదితరులు పాల్గొన్నారు.