బండారు నరేష్‌ మరియు నూతి సత్యనారాయణ కుటుంబాలకు 5 లక్షల చెక్ అందజేసిన నాదెండ్ల

పోలవరం, నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులైన కొయ్యలగుడెం మండలం, రామానుజపురానికి చెందిన బండారు నరేష్‌ మరియు టి నర్సాపురానికి చెందిన నూతి సత్యనారాయణ ప్రమాదవశాత్తు అకాలమరణం చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైరం నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా 5 లక్షల చెక్‌ను జనసేన పార్టీ పాశ్చిమగోదావరి జిల్లా అద్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు), జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, పోలవరం జనసేన పార్టీ ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్‌, సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, మండల అద్యక్షులు తోట రవి, పెద్దలు అప్పన ప్రసాద్‌ ల సమక్షంలో శుక్రవారం తాడేపల్లిగూడెంలో అందజేయడం జరిగింది. 500 కట్టి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల చెక్‌ను అందించిన జనసేన అంటే కార్యకర్తకి భరోసా అని నిరూపణ చేసిన పవన్‌కళ్యాణ్‌ కి బండారు నరేష్‌ మరియు నూతి సత్యనారాయణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.