లవ్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ డే

పాలకొల్లు నియోజకవర్గం: లేతమామిడి తోటలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ డే సందర్బంగా లవ్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి జై భీమ్ లు చెప్పారు. అనంతరం పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్, మల్టీకలర్ స్కెచ్ పాకెట్, బిస్కెట్స్ అందించారు. ఆయన మాట్లాడుతూ సతార మిలిటరీ స్కూల్ లో డా. అంబేద్కర్ జాయిన్ అయిన రోజును పురస్కరించుకొని ఇంటర్నేషనల్ స్టూడెంట్ డే గా దేశ వ్యాప్తంగా జరిగే విధంగా మహారాష్ట్రలో ఈ కార్యక్రమం ప్రారంభించారని, మహానుభావుడు ప్రపంచ మేధావి డా. అంబేద్కర్ చదువుకోవడం ప్రపంచ విద్యార్థులకే ఆదర్శం అని ఆయన నిత్యవిద్యార్దిగా కొనసాగారని విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలమని తెలియజేసారు. ఇకనుంచి ఈ కార్యక్రమం పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నమట్ల శివాజీ, తెన్నేటి జీవరత్నం, పెదపాటి కళ్యాణ్, తెన్నేటి నాగరాజు, ఉన్నమట్ల కిషోర్, చుట్టుగుళ్ల సుదీర్, కోటి విన్నుబాబు, వేడంగి మణికిరణ్, చికిలే రాజేష్, నేతల కార్తీక్, కుప్పుల రాజు, పాలపర్తి చిట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.