చిత్తూరు జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించిన నాదెండ్ల

ప్రతి కుటుంబాన్ని ఆదుకునే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది

తిరుపతి, భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కు లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కదలరు ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి అన్నారు. ఏ మాత్రం పరిపాలనా దక్షత లేని వ్యక్తిగా శ్రీ జగన్ రెడ్డి తయారయ్యారని చెప్పారు. జల విలయం వల్ల నష్టపోయిన చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించేందుకు మంగళవారం శ్రీ నాదెండ్ల మనోహర్ తిరుపతికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. శ్రీ మనోహర్ మాట్లాడుతూ “ప్రజలు కష్టాలు డుతుంటే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి జిల్లాకు రూ.2 కోట్లు సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉంది. బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీగా ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలిచేందుకు వచ్చాం. పార్టీ తరఫున వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాం. జనసేన పార్టీ తరఫున వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు విడతల పర్యటనలు జరపాలని శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మొదటి విడతగా తాను పర్యటించి వరద నష్టంపై అంచనాలు రూపొందిస్తాం. రెండో విడత శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంద”న్నారు. శ్రీ మనోహర్ గారికి జనసేన పార్టీ నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ కిరణ్ రాయల్, శ్రీమతి వినుత కోట, శ్రీ తాతంశెట్టినాగేంద్ర, శ్రీ సుంకర శ్రీనివాస్, శ్రీ కొట్టేవెంకటేశ్వర్లు తదితరులు స్వాగతం పలికారు.

జనానికి భరోసా కల్పించేందుకే జనసేన పర్యటన

తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో (చెంచులు) యానాదులకు నిత్యావసరాల పంపిణీ మా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాను వరద ముంపు ప్రాంతాలను సందర్శించడానికి నిరాశ్రయులైన వారికి నిత్యావసరాల పంపిణీ చేసేందుకు మేమున్నామంటూ.. భరోసా కల్పించే దిశగా తాము పయనిస్తున్నామని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం స్థానిక దేవేంద్ర థియేటర్ మార్గంలోని స్కావెంజర్స్ కాలనీలో పేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. సాయంకాలం ఈ పర్యటనలో జనసేన నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ తదితరుల నాయకులు పాల్గొన్నారు.

సీఎం మొద్దు నిద్ర వీడి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నిరాశ్రయులకు సాయం అందించాలి

రాయలసీమ కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో సీఎం జగన్ పర్యటించాలి. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్. జవ్వాది తుఫాన్ బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మంగళవారం జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేణిగుంట విమానాశ్రయంకు చేరుకొని మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారని, రాజధానిలో కూర్చొని సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయం అందిస్తున్నట్లు మాటలకే పరిమితమయ్యారేగాని క్షేత్రస్థాయిలో బాధిత ప్రాంతాలలో పర్యటించలేదన్నారు… వెంటనే కష్టాల్లో నష్టపోయి ఉన్న జనాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు…. నాదెళ్లవెంట రాష్ట్ర, జిల్లా, నాయకులు జనసేన స్థానిక నేతలు… డాక్టర్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ మరియు రాష్ట్ర నాయకులు జిల్లానాయకులు, జనసైనికులు తదితరులు ఉన్నారు.

శ్రీకాళహస్తి వరద బాధితులకు అండగా జనసేన

శ్రీకాళహస్తి నియోజకవర్గం, గడిచిన 10 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలను పరిశీలించడానికి, ప్రజలను పరామర్శించడానికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వారం రోజుల్లో రానున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందుగా క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి, ప్రజలను పరామర్శించడానికి ఈరోజు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, జీవగ్రామ్ కాలనిలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోట తో కలిసి జీవగ్రామ్ గ్రామంలో తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, అక్కడి ప్రజలను పరామర్శించారు, అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోట అధ్వర్యంలో శ్రీ నాదెండ్ల మనోహర్ బాధిత 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కాలువలు ఆక్రమణలకు గురి కావడం వలన ఈ పరిస్థితి కృత్రిమంగా ఏర్పడిందని ప్రజలు తెలియజేశారు. దాదాపు అన్ని కుటుంబాలు కట్టుబట్టలతో ఉన్న పరిస్థితి. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం 100 కుటుంబాలు ఉండగా కేవలం కొద్ది మందికే ఇచ్చారని అది కూడా జనసేన పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుందని హడావిడిగా చేశారని ప్రజలు తెలియజేశారు. అన్ని విధాలా నష్ట పోయిన ప్రజలకు అండగా జనసేన పార్టీ ఉండి, న్యాయం జరిగేలా చేస్తామని మనోహర్ గారు ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శ్రీమతి వినుత జరిగిన పరిస్థితులని వివరించారు జనసేన పార్టీ ప్రతి కుటుంబాన్ని కలిసి పరామర్శించిన తర్వాత స్థానిక శాసన సభ్యులు మొక్కుబడిగా ఆ ప్రాంతంలో పర్యటించారని, ఈరోజు జనసేన పార్టీ నుండి నాదెండ్ల మనోహర్ గారి పర్యటన ,నిత్యావసర వస్తువులు వితరణ కార్యక్రమాన్ని మధ్యాహ్నం చేయనున్నట్టు తెలిసి, హడావిడిగా బియ్యం పంపిణీ చేశారని తెలియజేశారు. స్థానిక ఎమారో వెంటనే అక్రమ కట్టడం తొలగించి కాలువను బాగు చెయ్యాలని డిమాండ్ చేశారు. లేని యెడల గ్రామస్థులతో కలిసి జనసేన పోరాడుతుందని తెలియజేశారు. మొక్కుబడిగా కొన్ని గ్రామాల్లో ఆర్థిక సహాయం కాకుండా దెబ్బ తిన్న ప్రతి గ్రామం లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబానికి 2000/- ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తిరుపతిలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు.

కేశవాయన గుంటలో ప్రవహిస్తున్న వరద వీధుల్లో జనసేన నేతలు

తిరుపతి, సాయి నగర్ పంచాయితీ పరిధిలోని కేశవాయనగుంట ప్రధాన మార్గాలలో, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లపైనే చెత్త పేరుకుపోయి ఉందని దీనివలన కాలువలో మురుగు నీరు సైతం వరద ప్రవాహంతో కలిసి, రోడ్లపై ప్రవహించడం పట్ల జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతలు తాము వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి వరద నీరు నిలవడానికి కారణమైన వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్ల వ్యర్ధాలను తొలగించామని.. గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాలతో సహా కేశవాయనగుంట పరిస్థితి ఏమని కార్పొరేషన్ ప్రజా ప్రతినిధుల్ని, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. మాటలు చెప్పడం కాదు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు. కార్పొరేషన్ సిబ్బంది చేత డ్యూటీలు కరెక్ట్ గా చేయిస్తే ఈ సమస్య ఉండదని హితవు పలికారు. ఈ మురుగు వ్యర్ధాల వల్ల పరిసర ప్రాంతాల్లో ఉండడం వలన ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో జనసేన రాష్ట్ర నేతలు నాదెండ్ల మనోహర్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ తో పాటు జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.

కేఎల్ఎం హాస్పిటల్ వద్ద జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పరామర్శ

తిరుపతి విమానాశ్రయం నుండి బయలుదేరి మొదట పూతల పట్టు, నాయుడుపేట మార్గాల జంక్షన్ హైవే నందుగల కె ఎల్ ఎమ్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలను శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటించి అక్కడి స్థానికులను పరామర్శించారు. తుఫానులో నష్టపోయిన వారిని పరామర్శించి వారి ఇళ్లను సందర్శించి, ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా పని చేస్తామని హామీ ఇచ్చారు.