జనసేనలో నాదెండ్ల ప్రస్థానం స్ఫూర్తిదాయకం

  • నమ్మకానికి, విశ్వాసానికి, క్రమశిక్షణకు నిలువెత్తురూపం నాదెండ్ల
  • తెనాలి అభివృద్ధిపై నాదెండ్లది చెరగని ముద్ర
  • హుందాతన రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ నాదెండ్ల
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

తెనాలి, జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ ప్రస్థానం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 297 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో సభాపతిగా నాదెండ్ల వ్యవహరించిన తీరు నభూతో నభవిష్యత్ అని కొనియాడారు. భూతులతో, అసభ్యపదజాలంతో నేటి రాజకీయ నేతలు వ్యవహరిస్తున్న కంపుకొట్టు రాజకీయాలకు భిన్నంగా ఎక్కడా పరుష పదజాలం వాడకుండా విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో నాదెండ్ల మాట్లాడే తీరు ఎంతో ఆదర్శనీయమన్నారు. రాజకీయాల్లో విలువలకు, విశ్వాసానికి నిలువెత్తు రూపంగా నాదెండ్ల నిలుస్తారన్నారు. దశాబ్ద కాల శాసనసభ్యుడిగా తెనాలి అభివృద్ధిపై నాదెండ్లది చెరగని ముద్ర అన్నారు. నాదెండ్ల నాయకత్వం కోసం తెనాలి ప్రజలు ఎదురుచూస్తున్నారని రానున్న ఎన్నికల్లో తెనాలి ప్రజల ఆశ నెరవేరనున్నదని జోస్యం చెప్పారు. అవినీతి, అరాచకాలే ఆలంబనగా దోపిడీలు, దాడులే లక్ష్యంగా సాగుతున్న వైసీపీ దాష్టీక పాలనపై రాజకీయ యుద్ధం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొండంత అండగా నాదెండ్ల నిలిచారన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి, పార్టీలో ఉన్నతస్థాయిలో ఉన్నా కూడా ఒక సామాన్య కార్యకర్తలా నిరంతరం పార్టీ అభ్యున్నతికి కష్టపడుతున్న నాదెండ్ల మనోహర్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, స్వామి, కోలా అంజి, బాలాజీ, వడ్డె సుబ్బారావు, దాసరి రాము, ఫణి, అన్వేష్, రాంబాబు, ఆళ్ళ కాసులు, రేవంత్, మణి, సైదా, తాడికొండ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.