‘బాపు బొమ్మకు పెళ్లి’…లో నాగబాబు తనయ పెళ్లి విశేషాలు

సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. గుంటూరు కుర్రాడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమై నిశ్చితార్దం కూడా జరిగినది. ఈ నేపథ్యంలో ఆమె ఓ టీవీ షోలో పెళ్లి కూతురిగా ముస్తాబై కనపడి అందరి దృష్టినీ ఆకర్షించింది. వినాయక చవితి సందర్భంగా నాగబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ‘బాపు బొమ్మకు పెళ్లి’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో నిహారిక పెళ్లికి సంబంధించిన విశేషాలు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ”వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ… అంగరంగ వైభవంగా జరిగే ‘బాపు బొమ్మకి పెళ్ళంట’ వినాయక చవితి స్పెషల్ … త్వరలో మీ జీ తెలుగులో..” అంటూ ఆ ఛానెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

తన కూతురుని పెళ్లి కూతురిగా చూసి నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో యాంకర్ అనసూయ దంపతులు కూడా సందడి చేయనున్నారు. కాగా, ఈ నెలలోనే నిహారిక-చైతన్య ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని నాగబాబు కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.