నాగర్ కర్నూల్ జనసేన నిరసన కార్యక్రమం

నాగర్ కర్నూల్, మైనర్ బాలికకు న్యాయం జరగాలని అడిగినందుకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వీరమహిళలను అలాగే గ్రేటర్ నాయకులను, జనసేన కార్యకర్తలను, వీరమహిళలను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషం. దీనిని రాష్ట్ర యువజన విభాగం పూర్తిగా ఖన్డిస్తూ… బాధితురాలికి న్యాయం జరిగే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు శనివారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తిమ్మాజిపేట్ మండలం, ఆర్.సి తాండ గ్రామంలో నాగర్ కర్నూల్ పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్. శ్రీను, ఆర్. శ్రీకాంత్, ఆర్. మల్లేష్, వి. వినోద్, ఆర్ సురేష్, లక్ష్మణ్, నరేందర్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.