బైక్ అంబులెన్స్‌ను ప్రారంభించిన నగరి ఎమ్మెల్యే

అత్యవసర వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చిన రెండు బైక్ అంబులెన్స్‌లను నగరి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. రోజా కోరిక మేరకు శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ రెండు బైక్ అంబులెన్స్ వాహనాలను తయారుచేసి అందించింది. వాటిని నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోజా తన చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు.

నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు చెరొక బైక్ అంబులెన్స్‌లను రోజా అందజేశారు. ఈ సందర్భంగా రోజా స్వయంగా బైక్ అంబులెన్స్‌ను నడిపి సందడి చేశారు. ఈ సందర్భంగా బైక్ అంబులెన్స్‌లు అందజేసిన హీరో మోటార్స్‌కు రోజా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ముఖ్య నాయకులు, హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.